లండన్: లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కెఎల్ రాహుల్ (KL Rahul) చెలరేగిపోయాడు. యశస్వీ జైస్వాల్, శుభ్‌మాన్ గిల్‌లు త్వరగా ఔట్ అయిన తరుణంలో తాను జట్టుకు అండగా నిలిచాడు. ఇంగ్లండ్ ఆటగాళ్ల బౌలింగ్‌ను ఎదురుకుంటూ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో రాహుల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సేనా దేశాల్లో (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) అత్యధిక సార్లు 50కి పైగా పరుగులు చేసిన ఆసియా ఓపెనర్ల లిస్ట్‌లో రాహుల్ మూడో స్థానంలో నిలిచాడు.
ఈ లిస్ట్‌లో మొదటి స్థానంలో టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఉన్నారు. ఆయన 19 సార్లు సేనా దేశాల్లో 50+ స్కోర్‌ను సాధించారు. ఆ తర్వాతి స్థానంలో శ్రీలంక మాజీ ఆటగాడు దిముత్ కరుణ రత్నే(12) నిలిచారు. మూడో స్థానంలో నిలిచిన రాహుల్ (KL Rahul) భారత డాషింగ్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ని అధిగమించాడు. సెహ్వాగ్, సయిద్ అన్వర్, తమీమ్ ఇక్బాల్ 10 సార్లు 50+ స్కోర్‌ను సాధించారు. ఇక రాహుల్ సెంచరీ, రవీంద్ర జడేజా అర్థశతకంతో ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో కచ్చితంగా 387 పరుగులు చేసి ఇంగ్లండ్ స్కోర్‌ను సమం చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 1 ఓవర్ ఆడి 2 పరుగులు చేసి.. అంతే ఆధిక్యం సంపాదించింది.