Wednesday, April 30, 2025

పుట్టినరోజున ఫ్యాన్స్‌కి కెఎల్ రాహుల్ సర్‌ప్రైజ్

- Advertisement -
- Advertisement -

భారత క్రికెటర్ కెఎల్ రాహుల్ శుక్రవారం తన పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌కి ఓ సర్‌ప్రైజ్ అందించాడు. కొద్దిరోజుల క్రితమే రాహుల్ తండ్రైన విషయం అందరికీ తెలిసిందే. మార్చి 25వ తేదీన రాహుల్ సతీమణి అతియా శెట్టి.. పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే శుక్రవారం రాహుల్ తమ గారలపట్టి పేరును అభిమానులతో పంచుకున్నాడు. తన కుమార్తెకు ‘ఇవారా’ అని నాయకరణం చేసినట్లు తెలిపాడు.

చిన్నారిని ఎత్తుని ఉన్న ఫోటోను రాహుల్ సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘మా బేబీ గర్ల్, మా ప్రపంచం.. ఇవారా.. దేవుడి కానుక’ అంటూ ఈ ఫోటోకి అతను క్యాప్షన్ పెట్టాడు. ఈ ఫోటోపై అభిమానులు పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తున్నారు. రాహుల్ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో బిజీగా ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు అతను ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆడిన 6 మ్యాచుల్లో 5 మ్యాచుల్లో విజయం సాధించి టేబుల్‌లో మొదటిస్థానంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News