న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 18వ సీజన్లో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అక్షర్ పటేల్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు ఓ ఆంగ్ల పత్రిక నివేదికలో పేర్కొంది. అక్షర్‌ను ఆ స్థానం నుంచి తప్పించి.. టీం ఇండియా స్టార్ కెఎల్ రాహుల్‌కు ఆ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది అక్షర్ కేవలం ఆటగాడిగా మాత్రమే జట్టులో కొనసాగుతాడని రిపోర్ట్‌లో రాసుకొచ్చారు.
గత సీజన్లో అక్షర్ పటేల్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టు ఊహించినంతగా రాణించలేదు. 14 మ్యాచుల్లో కేవలం 5 మ్యాచుల్లో మాత్రమే నెగ్గి 5వ స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఈ సీజన్‌కి ముందే కెఎల్ రాహుల్‌ని కెప్టెన్ చేయాలని అనుకున్నారు. కానీ, రాహుల్ మొగ్గు చూపకపోవడంతోనే అక్షర్‌కు కెప్టెన్సీ అప్పగించారని టాక్. అయితే ఈసారి మాత్రం రాహుల్ కెప్టెన్సీ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలుస్తోంది. లక్నో సూపర్‌జెయింట్స్ జట్టును మూడు సీజన్ల పాటు కెప్టెన్‌గా ముందుకు నడిపించిన అనుభవం రాహుల్‌కి ఉంది. దీంతో ఈ అనుభవం తమ జట్టుకు ఉపయోగపడుతుందని ఢిల్లీ ఫ్రాంచైజీ భావిస్తోందని సమాచారం. అయితే దీనిపై ఢిల్లీ జట్టు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. త్వరలోనే ప్రకటన వస్తుందని నివేదిక పేర్కొంది.
Also Read : భారత్ vs ఆస్ట్రేలియా మ్యాచ్‌ల క్రేజ్.. అప్పుడే టికెట్లు ఖతం