Thursday, August 21, 2025

ఎసిబి వలలో కోదాడ ఫారెస్ట్ బీట్ అధికారి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట జిల్లా, కోదాడ ఫారెస్టు రేంజ్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఫారెస్టు బీట్ అధికారి అనంతుల వెంకన్న బుధవారం నల్గొండ రేంజ్ యూనిట్ ఎసిబి అధికారులకు పట్టుబడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. కలప వ్యాపారానికి ఎటువంటి ఆటంకం కలుగకుండా ఉండేందుకు ఓ ఫిర్యాదుడి నుండి రూ.20 వేల లంచాన్ని ఆయన డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు నల్గొండ ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు బాధితుడు ఫారెస్టు బీట్ అధికారి అనంతుల వెంకన్నకు రూ.20వేలు లంచం డబ్బులు ఇచ్చాడు. ఆ సొమ్మును బైక్ ట్యాంక్ కవర్ జేబులో పెడుతుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ఫారెస్టు బీట్ అధికారిని అరెస్టు చేసి హైదరాబాదులోని నాంపల్లి ఎసిబి ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తామని నల్గొండ ఎసిబి అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News