Sunday, August 31, 2025

కేబినెట్ కీలక నిర్ణయం.. కోదండరామ్, అజారుద్దీన్‌లకు గుడ్‌న్యూస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా ప్రొఫెసర్ కోదండరామ్ (Kodandaram), మాజీ క్రికెటర్ అజారుద్ధీన్‌లకు (Azharuddin) కేబినెట్ శుభవార్త అందించింది. గవర్నర్ కోటాలో వీరిద్దరిని ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాలని తీర్మానించింది. కొద్ది రోజుల క్రితం సుప్రీం కోర్టు ఆదేశాలతో కోదండరామ్, అమీర్ అలీ ఖాన్‌ల ఎమ్మెల్సీ నియామకం రద్దైన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ అయింది.

తాజాగా మరోసారి కోదండరామ్‌ను, అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్ధీన్‌కు ఎమ్మెల్సీ సీటును పక్కా చేసింది. రాష్ట్ర కేబినెట్‌ ఈ విషయాన్ని తీర్మానించి గవర్నర్‌కు పంపించింది. దీంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎదురు చూస్తున్న అజారుద్ధీన్‌ను అనూహ్యంగా ప్రభుత్వం ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది.

Also Read : బిసి రిజర్వేషన్ బిల్లును సభలో ప్రవేశపెడతాం: శ్రీధర్ బాబు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News