రాష్ట్ర వ్యాప్తంగా మహిళా జనసమితి కమిటీల నిర్మాణానికి కృషి చేయాలని తెలంగాణజనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొ. కోదండరాం పార్టీ మహిళా నాయకులను కోరారు. తెలంగాణ జన సమితి పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రాగులపెల్లి లక్ష్మి ఆధ్వర్యంలో గురువారం నాంపల్లి పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టిజెఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె వినయ్ కుమార్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సమస్యల పరిష్కారానికి పాటుపడాలని మహిళా విభాగ సభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా జన సమితి మహిళా నాయకురాళ్ళు అరికిల్ల స్రవంతి, వి. పుష్పలత, లక్ష్మి, బి. లావణ్య, ఎస్. రేఖ తదితరులు పాల్గొన్నారు.
Also Read: విమోచన దినోత్సవ వేడుకలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాక