Tuesday, May 13, 2025

రిటైరైన తర్వాతి రోజే కోహ్లీ, అనుష్క ఏం చేశారంటే..

- Advertisement -
- Advertisement -

టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) టెస్ట్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. 14 సంవత్సరాల సుదీర్ఘ టెస్ట్ కెరీర్‌కి కోహ్లీ సోమవారం శుభం పలికాడు. ఈ వార్త అభిమానులను నిరుత్సాహపరిచినా.. ఆ తర్వాత అందరూ అర్థం చేసుకొని కోహ్లీ (Retirement) నిర్ణయాన్ని సమర్థించారు. కోహ్లీ భార్య అనుష్క కూడా కోహ్లీకి మద్ధతు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

అయితే రిటైర్‌మెంట్ తర్వాత కోహ్లీ దంపతులు ఆధ్యాత్మిక కేంద్రాన్ని సందర్శించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ బృందావనం థామ్‌కి వెళ్లిన కోహ్లీ దంపతులు అక్కడ ప్రేమానంద్‌ మహారాజ్ ఆశీస్సులు అందుకున్నారు. గతంలో చాలాసార్లు కోహ్లీ, అనుష్కలు ఈ ఆశ్రమాన్ని సందర్శించారు. అయితే టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ తర్వాత కోహ్లీ పాల్గొన్న తొలి వ్యక్తగత కార్యక్రమం ఇదే కావడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News