Monday, May 12, 2025

రిటైర్‌మెంట్‌పై పట్టు వదలని కోహ్లీ.. బతిమాలుతున్న బిసిసిఐ

- Advertisement -
- Advertisement -

ముంబై: టీం ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Kohli) టెస్ట్‌ క్రికెట్ నుంచి రిటైర్‌ అవుతానని బిసిసిఐ సెలక్షన్ కమిటీకి చెప్పినట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పాడు. అతని స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనే సతమతమవుతున్న బిసిసిఐకి కోహ్లీ కూడా రిటైర్‌(Retirement) అవుతాను అని అనడం తలనొప్పిగా మారింది.

భారత జట్టు మరికొన్ని రోజుల్లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ప్రతిష్టాత్మకమైన ఈ సిరీస్‌లో సీనియర్లు లేకుండా బరిలోకి దిగడం జట్టుకు అంత మంచిది కాదు. దీంతో రిటైర్‌ అవుతానని కోహ్లీ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బిసిసిఐ కోరుతుంది. కానీ, తన నిర్ణయంపై కోహ్లీ(Kohli) పట్టు వదలకుండా ఉన్నాడని సమాచారం. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం.. కోహ్లీ రెండు వారాల క్రితం రిటైర్‌మెంట్(Retirement) గురించి సెలక్షన్ కమిటీకి తెలియజేశాడట. అయితే వాళ్లు ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో అతన్ని పాల్గొనాలని కోరారని తెలుస్తోంది. కానీ, కోహ్లీ మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనే అవకాశం లేదని సెలక్షన్ కమిటీతో చెప్పినట్లు సమాచారం. అయితే చివరిగా ఓ మీటింగ్ నిర్వహించి.. అందులో తుది నిర్ణయం తీసుకుంటారని కథనంలో పేర్కొంది.

అయితే కోహ్లీ రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పలువురు మాజీలు కూడా అంటున్నారు. ఇంగ్లండ్ పర్యటన ఎంతో కీలకమైందని ఆ సిరీస్‌ కోహ్లీ ఆడాలని వాళ్లు కోరుతున్నారు. అభిమానులు కూడా కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లో కొనసాగాలని అభ్యర్థిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News