Wednesday, September 3, 2025

ఆ విషాదాన్ని ఎప్పటికీ మర్చిపోలేను.. కోహ్లీ భావోద్వేగం

- Advertisement -
- Advertisement -

సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2025 సీజన్‌లో ఐపిఎల్ ట్రోఫీని గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఐపిఎల్ ట్రోఫీ సాధించిన ఆనందం బెంగళూరు టీమ్‌కు ఎక్కువ సేపు నిలువలేదు. విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట జరిగి పలువురు మృత్యువాత పడడం దేశాన్ని విషాదంలో ముంచెత్తింది. ఈ ఘటనపై తాజాగా బెంగళూరు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి స్పందించాడు. బెంగళూరు ఫ్రాంచైజీ యాజమాన్యం ఇటీవల ఆర్‌సిబి కేర్స్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. ఈ క్రమంలో కోహ్లి భావోద్వేగానికి గురయ్యాడు. జూన్ 4న జరిగిన హృదయ విదారక ఘటన తనను ఎంతో కలచి వేసిందన్నాడు. జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదన్నాడు. మా ఫ్రాంచైజీ చరిత్రలోనే అత్యంత సంతోషకరమైన క్షణం తీవ్ర విషాదంగా మారడం ఎప్పటికీ మరచిపోలేనన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News