Friday, May 2, 2025

యువకుడి ప్రాణం తీసిన ఫుల్ బాటిల్స్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: పందెం కాసి ఐదు ఫుల్ బాటిల్స్ మద్యం సేవించడంతో యువకుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం కోలార్ జిల్లా నన్‌గళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కార్తీక్ అనే యువకుడు ఐదు ఫుల్ బాటిల్స్ మద్యం తాగుతానని స్నేహితులతో ఛాలెంజ్ చేశాడు. స్నేహితులతో కలిసి పది వేల రూపాయల పందెంలో పాల్గొన్నాడు. 24 గంటలలో ఐదు ఫుల్ బాటిల్స్ మద్యం తాగడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఎనిమిది రోజుల క్రితమే అతడి భార్య పండంటి బిడ్డకు జన్మినించింది. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు స్నేహితులను అరెస్టు చేయగా మరో నలుగురు పరారీలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News