Tuesday, July 15, 2025

రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత అనిల్ మృతి… కానీ భుజంలో రెండు బుల్లెట్లు?

- Advertisement -
- Advertisement -

మెదక్: కాంగ్రెస్ ఎస్ సి సెల్ అధ్యక్షుడు అనిల్ అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం మైదక్-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ యువనేత అనిల్ మెదక్ జిల్లాలో పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నాడు. మెదక్ నుంచి సొంతూరుకు వెళ్తుండగా చిన్నఘన్ పూర్ వద్ద కల్వర్టు ఢీకొని పొలాల్లోకి దూసుకెళ్లింది. అనిల్ కొన ఊపిరితో ఉండడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించడగా బులెట్లు కనిపించాయి. అతడి కుడి భుజం నుంచి రెండు బుల్లెట్లు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యా?, ఆత్మహత్య, రోడ్డు ప్రమాదమా? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనిల్ ను హత్య చేశారని మృతుడి బంధువులు ఆరోపణలు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News