Friday, August 29, 2025

కెసిఆర్‌ను బద్నాం చేసే కుట్రలు : కోలేటి ధ్వజం

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వ అరాచక పాలన చూస్తుంటే ఆనాడు భద్రాచలంలో రామందిరం నిర్మించిన రామదాసును జైల్లో పెట్టినట్లు తెలంగాణ ప్రజల కొంగు బంగారం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కెసిఆర్‌ను కూడా బద్నాం చేసే కుట్రలకు తెర తీశారని రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ కోలేటి దామోదర్ ఆరోపించారు. తెలంగాణ నాశనం కోరుకునే వంకరబుద్ధి గాళ్లకు ఈర్శ్య, అసూయ పుట్టించే విధంగా జలాభిషేకం చేసిన వరప్రదాయిని కాళేశ్వరంపై విషం కక్కుతున్నారని ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. వందేళ్ల భవిష్యత్‌ను దృషి ్టలో పెట్టుకుని కెసిఆర్ కాళేశ్వరం నిర్మించారని, గోదావరి నదిపై బ్యారేజీ కట్టిన సర్ ఆర్థర్ కాటన్‌లా కెసిఆర్ ఇక్కడి ప్రజల గుండెల్లో దేవుడిలా నిలిచిపోతుండడాన్ని జీర్ణించుకోలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారాలకు తెర తీసిందని ఆయన ధ్వజమెత్తారు. గోదావరి జలాలను ఆంధ్రా ప్రాంతానికి తరలించడానికి కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు విషం చిమ్ముతోందని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజె క్టు ఒక ఆధునిక దేవాలయమని, కాళేశ్వరం దేశానికే అన్నం పెట్టే మహాజలశక్తి పీఠమని ఆయన అభివర్ణించారు. తెలంగాణలో కరువుకాటకాల కు, ప్రజల కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం నీళ్లు అని ఆయన స్పష్టం చేశారు. కెసిఆర్‌ను బద్నాం చేయాలన్న దురుద్దేశ్యంతోనే శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్టుగా ఉందని ఆయన విమర్శించారు. గోదావరిలో తెలంగాణ వాటాగా దక్కే ప్రతి నీటి చుక్కని ఒడిసిపట్టే కెసిఆర్ ఆలోచన ఫలితమే కాళేశ్వరం అద్భుతమైన జలదృశ్యమని దామోదర్ కొనియాడారు. తెలంగాణలో జలసిరులు కురిపించి ప్రజల హృద యాల్లో నిలిచిపోయిన కెసిఆర్‌పై అవాకులు చవాకులు మాట్లాడే కాంగ్రెస్ నాయకులకు స్ధానిక సంస్ధల ఎన్నికలే గుణపాఠం కానున్నాయన్నా రు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ కక్షపూరిత చర్యలను విడనాడి ప్రజా సమస్యలపై దృష్టి పెడితే మంచిదని దామోదర్ సలహా ఇచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News