Sunday, May 4, 2025

చితక్కొట్టిన రస్సెల్.. రాయల్స్ లక్ష్యం ఎంతంటే..

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: ఐపిఎల్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్ విధ్వంసకర ఆటగాడు రస్సెల్ చెలరేగిపోయాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ పెద్దగా పరుగులు చేయని రస్సెల్.. ఆదివారం బ్యాట్ ఝులిపించాడు. 25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సులతో 57 పరుగులు చేశారు. ఫలితంగా రాజస్థాన్‌కు కోల్‌కతా 207 పరుగుల విజయలక్ష్యాన్ని ముందుంచింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా ఆరంభంలోనే నరైన్(11) వికెట్ కోల్పోయింది. ఈ దశలో రహానె, మరో ఓపెనర్ గుర్బాజ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కి 53 పరుగులు జోడించారు. అప్పుడే తీక్షణ బౌలింగ్‌లో గుర్బాజ్(35) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత రఘువంశీతో కలిసి రహానే భాగస్వామ్యం నిలిపే ప్రయత్నం చేశాడు. అయితే 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రహానే.. పరాగ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

ఈ క్రమంలో బ్యాటింగ్‌కి వచ్చిన రస్సెల్, సూర్యవంశీతో కలిసి రాయల్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు. సూర్యవంశీ 31 బంతుల్లో 44 పరుగులు చేసి వెనుదిగాడు. కానీ, రస్సెల్ మాత్రం మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. మరోవైపు రింకు సింగ్‌(19) రస్సెల్‌కి మంచి సహకారం అందించాడు. దీంతో కోల్‌కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. రాయల్స్ బౌలింగ్‌లో ఆర్చర్, యుద్వీర్, తీక్షణ, పరాగ్ తలో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News