Friday, September 12, 2025

ఆ వైద్య కళాశాలలకూ జగన్ పేరు : కొల్లు రవీంద్ర

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎపిలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ విజయాన్ని వైసిపి తట్టుకోలేకపోతుందని ఎపి మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్రాభివృద్ధిపై మాట్లాడే నైతిక అర్హత కూడా వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి కు లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిర్మించని వైద్య కళాశాలలకూ జగన్ పేరు వేసుకున్నారని, మెడికల్ కాలేజీల పేరుతో జగన్ రూ.6 వేల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. టెండర్లు రద్దు చేస్తాం, అభివృద్ధిని కూల్చేస్తామంటూ బెదిరిస్తున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. రాష్ట్రానికి 22 వైద్యకళాశాలలు తీసుకొచ్చిన ఘనత ఎపి సిఎం చంద్రబాబు నాయుడు అని కొల్లు రవీంద్ర కొనియాడారు.

Also Read : ఆర్టిసి బస్సు బోల్తాపడి 10 మందికి గాయాలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News