Sunday, July 13, 2025

కోట మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కోమటిరెడ్డి, పొన్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కోట శ్రీనివాసరావు మృతి పట్ల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోట శ్రీనివాసరావు మృతి తెలుగు సినీ లోకానికి తీరని లోటు అని కోమటి రెడ్డి తెలిపారు. ఆయన చేసిన పాత్రలు సమాజంలో మార్పును కలిగించేలా ఉండేవని ప్రశంసించారు. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు, అభిమానులకు కోమటిరెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

750కి పైగా సినిమాల్లో విలక్షణమైన పాత్రల ద్వారా తన నటనతో ప్రేక్షకులను అలరించారని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. కోట శ్రీనివాసరావు మృతి తెలుగు సినీ లోకానికి తీరని లోటు అని బాధను వ్యక్తం చేశారు. ఆయన చేసిన పాత్రలు సమాజంలో మార్పును కలిగించేలా ఉండేవన్నారు. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు, అభిమానులకు పొన్నం ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారుజామున 4గంటలకు కన్నుమూశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News