Monday, August 4, 2025

కవిత ఎవరో నాకు తెలియదు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎవరో తనకు తెలియదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిసిల కోసం కవిత ధర్నా చేయడమనేది పెద్ద జోక్ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంబించారు. మినిస్టర్ క్యాంప్ ఆఫీస్‌కు ఇందిరా భవన్‌కు నామకరణం చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. నల్లగొండ ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటానని, వారికి మరింత చేరువగా సేవలందించేందుకు ఇందిరా భవన్ ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో స్కామ్ జరిగిందని, ఇప్పటికే కొందరిపై చర్యలు తీసుకున్నామని, ఫోన్ ట్యాపింగ్ నిందితులు జైలుకు వెళ్లారని, తన ఫోన్ మాత్ర ట్యాపింగ్ గురికాలేదని స్పష్టం చేశారు.

బిసి రిజర్వేషన్ల కోసం మోడీ ప్రభుత్వంతో కొట్లాడుతానని, ఆర్డినెన్సు తీసుకోస్తానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. బనకచర్ల విషయంలో కేంద్రతో కొట్లాడుతామని, బనకచర్ల నిర్మాణాన్ని అడ్డుకుంటామని పేర్కొన్నారు. ఎపి మంత్రి నారా లోకేష్‌కు రాజీకీయ అవగాహన లేదని మండిపడ్డారు. కేబినెట్‌లో జరగబోయే చర్చపై తాను ముందుగా మాట్లాడనని వివరణ ఇచ్చారు. నల్లగొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టు అని ఈ సంవత్సరంలో పూర్తి చేస్తామన్నారు. గత సంవత్సరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాకపోవడంతో తాను బాధపడ్డానని, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు జైవీర్ రెడ్డి, వేముల వీరేశం, బత్తుల లక్ష్మా రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News