- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రిగా పదేళ్ళూ తానే ఉంటానని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుల్లో కలవరం సృష్టించింది. అధిష్టానం ఉండగా, సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం భావ్యం కాదని పార్టీ నేతలు మాట్లాడుకుంటుండగా, పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడుగు ముందుకేసి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది పార్టీ విధానాలకు, సిద్ధాంతానికీ వ్యతిరేకమని ఆయన శనివారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాల ప్రకారం ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనేది అధిష్టానం నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. అయితే వ్యక్తిగతంగా ఎవరైనా ఇలాంటి ప్రకటనలు చేయవద్దని ఆయన హితవు పలికారు.
- Advertisement -