- Advertisement -
హైదరాబాద్: బేగంపేట ఎయిర్ పోర్టుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమయానికి రాకపోవడంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. బేగంపేట ఎయిర్‌పోర్టుకు ఉత్తమ్ ఆలస్యంగా రావడంతో మంత్రి కోమటి రెడ్డి అలిగి వెళ్లిపోయారు. కోమటిరెడ్డి లేకుండానే బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి నాగార్జునసాగర్‌కు మంత్రులు ఉత్తమ్, లక్ష్మణ్ బయల్దేరారు. నాగార్జున సాగర్ కు భారీగా వరద ప్రవాహం రావడంతో జలాశయం నిండుకుండలా మారింది. సాగర్ క్రస్ట్ గేట్లను మంత్రులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
- Advertisement -