Sunday, June 15, 2025

నవ్వితే అరెస్టు చేస్తారా?

- Advertisement -
- Advertisement -

కొమ్మినేని కేసులో ఎపి ప్రభుత్వం
తరఫు లాయర్‌ను నిలదీసిన సుప్రీం
ఆయన చేయని వ్యాఖ్యలకు ఎలా
బాధ్యుడిని చేస్తారని ప్రశ్న..
కొమ్మినేనికి బెయిల్ మంజూరు

మన తెలంగాణ/అమరావతి: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు లో భారీ ఊరట లభించింది. సాక్షి ఛానల్‌లో అ మరావతి మహిళలను కించపరిచేలా చర్చా కా ర్యక్రమం నిర్వహించి, అనుచిత ప్రశ్నలు వేశారన్న ఆరోపణలపై అరెస్టయిన ఆయనను తక్షణమే విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే, భవిష్యత్తులో ఇ లాంటివి పునరావృతం చేయవద్దని ధర్మాసనం ఆయనను గట్టిగా హెచ్చరించింది. తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ కొమ్మినేని శ్రీనివాసరావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన ధర్మాసనం ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. కొమ్మినేనిని విడుదల చేయాలని ఆదేశిస్తూ బెయిల్ మంజూరు చేసింది. కొమ్మినేని విడుదలకు సంబంధించిన అన్ని నిబంధనలు, ప్రక్రియలను సంబంధిత ట్రయల్ కోర్టు చూసుకుంటుందని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం స్ప ష్టం చేసింది.విచారణ సందర్భంగా కొమ్మినేని తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపిస్తూ సాక్షి ఛానల్ లో చర్చ సందర్భంగా కొమ్మినేని మహిళల పట్ల ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, చర్చలో పా ల్గొన్న ఒక ప్యానలిస్ట్ ఆ వ్యాఖ్యలు చేశారని కో ర్టుకు తెలిపారు.

కొమ్మినేని శ్రీనివాసరావును అ క్రమంగా అరెస్టు చేశారని, నోటీసులు కూడా ఇ వ్వలేదని పేర్కొన్నారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేయవద్దని కొమ్మినేని వారించారని, వాటిని సమర్థించలేదదన్నారు. దీంతో కోర్టు స్పందిస్తూ పిటిషనర్ చేయని వ్యాఖ్యలకు ఆయనను ఎలా అరెస్ట్ చేస్తారని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గిని ప్రశ్నించింది. వాక్ స్వాతంత్య్రాన్ని రక్షించాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోర్టు సూచించింది. నవ్వినంత మాత్రాన అరెస్టు చేస్తారా అని సుప్రీంకోర్టు ని లదీసింది. దీనికి సమాధానంగా రోహత్గి స్పం దిస్తూ ప్యానలిస్ట్ అనుచిత వ్యాఖ్యలు చేస్తుండగా ఆయనను ప్రోత్సహించేలా కొమ్మినేని వ్యవహరించారని, గట్టిగా నవ్వుతూ ఉన్నారని చెప్పా రు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం కొమ్మినేనికి అనుకూలంగా తీర్పును వెలువరించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇతరులు చేసిన తప్పుకు ఆయనను అరెస్ట్ చేయడం సరికాదని, విడుదల సందర్భంగా అవసరమైన షరతులను ట్రయల్ కోర్టు విధిస్తుందని స్పష్టం చేసింది.

చంద్రబాబుకి పెద్ద చెంపపెట్టు: జగన్
సీనియర్ పాత్రికేయుడు, సాక్షి చానల్ న్యూస్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించడంపై వైసీపీ అధినేత జగ న్ స్పందించారు. ‘సత్యమేవ జయతే‘ అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శ్రీనివాసరావుని వెంటనే విడుదల చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబుకి పెద్ద చెంపపెట్టుఅన్నారు. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు న్యాయస్థానం గట్టిగా బుద్ధిచెప్పిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News