Tuesday, September 2, 2025

బతుకమ్మ కార్నివాల్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : టూరిజం శాఖ ఆధ్వర్యంలో తొలి బతుకమ్మ వేడుకలు కార్నివా ల్ స్థాయిలో నిర్వహించనున్నట్లు అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. రాణిరుద్రమ, సమ్మక్క, సారక్క, చాకలి ఐలమ్మ, హజారే మంగమ్మ వంటి ధీనవనితలు పుట్టిన నేల ఓరుగల్లు అని ఆమె తెలిపారు. అటువంటి వరంగల్ జిల్లాలో బతుకమ్మ వేడుకలను మొదటిసారిగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమని ఆమె తెలిపారు. తాను, మంత్రి సీతక్క, టూరిజం ఎండి క్రాంతి ముగ్గు రం మహిళమేనని, టూరిజం శాఖ తరపున నిర్వహించే తొలి బతుకమ్మ వేడుకలను విజయవం తం చేస్తామని మంత్రి పేర్కొన్నారు. సోమవారం సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, టూరిజం కార్పొరేషన్ ఎండి వల్లూరి క్రాంతి, సాంస్కృతిక విభాగం సంచాలకులు మామిడి హరికృష్ణ, బతుకమ్మ పండుగ నిర్వాహకురాలు దిల్లీశ్వరితో కలిసి మంత్రి కొండా సురేఖ సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం బతుకమ్మ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆట, పాటలతో జరుపుకునే గొప్ప పండుగ మన బతుకమ్మ అని, ఇది అత్యంత ప్రాచీనమైనదని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

ఈ పండుగ పువ్వులనే కాదు, చెరువులను కూడా పూజించే పండుగ అన్నారు. ఈ బతుకమ్మ సందర్భంగా మన పెద్దలను కూడా పూజిస్తామన్నారు.ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ రకరకాల పూలను ఒక్కచోట అలంకరించి బతుకమ్మగా కొలవడం తెలంగాణ ప్రత్యేకత అని మంత్రి తెలిపారు. 9 రోజుల పాటు 9 వేడుకలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. బతుకమ్మ కూడా తెలంగాణ టూరిజానికి అలాంటి బ్రాండ్ ఐడెంటిటీ ఇస్తుందని మంత్రి తెలిపారు. ఈనెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతుందన్నారు. వచ్చే ఐదేళ్లలో పర్యాటక రంగంలో రూ.15,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించే విధంగా ప్రణాళికలు రూపొందించామని, దీనివల్ల కనీసం మూడు లక్షల మందికి అదనంగా ఉపాధి కల్పించవచ్చని ఆయన తెలిపారు. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షించడంలో దేశంలో తొలి ఐదుస్థానాల్లో తెలంగాణను నిలపడం రాష్ట్ర ఆదాయంలో 10 శాతం, అంతకంటే ఎక్కువగా టూరిజం నుంచి వచ్చేలా చూడటం ఈ లక్ష్యాల్లో భాగమని ఆయన తెలిపారు.

సెప్టెంబర్ 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వేడుకలు
21వ తేదీన వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి వద్ద బతుకమ్మ ప్రారంభమవుతుంది. 22వ తేదీ నుంచి 24 వరకు, ప్రతి రోజు 3-4 జిల్లాల్లోని ముఖ్య ఆలయాలు, పర్యాటక, సాంస్కృతిక ప్రదేశాల్లో వేడుకలను నిర్వహిస్తారు. దీంతోపాటు ట్యాంక్ బండ్ వద్ద 27వ తేదీన -బతుకమ్మ కార్నివల్ ఈవెనింగ్, 28వ తేదీన ఎల్‌బి స్టేడియంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రయత్నం, 10,000ల కంటే ఎక్కువ మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు, 29వ తేదీన ఉత్తమ బతుకమ్మ పోటీ (పీపుల్స్ ప్లాజా వద్ద), 29వ తేదీన – ఐటీ రంగం ఉద్యోగులు, ఆర్‌డబ్లూఏల పోటీ, 30వ తేదీన -ట్యాంక్ బండ్ వద్ద గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, ఫ్లోరల్ హోళి, ‘బతుకమ్మ సైకిల్ రైడ్ (సెప్టెంబర్ 28వ తేదీ) ‘మహిళల బైకర్స్ రైడ్ (సెప్టెంబర్ 29వ తేదీ) ‘విన్టేజ్ కార్ ర్యాలీ (సెప్టెంబర్ 30వ తేదీ), సెప్టెంబర్ 25వ తేదీ నుంచి 4 రోజుల పాటు మాదాపూర్‌లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో బతుకమ్మ థీమ్‌తో ఆర్ట్ క్యాంప్, సరస్ బజార్ -పీపుల్స్ ప్లాజాలో మహిళల స్వయం సహాయక సంఘాలతో కార్యక్రమం, బతుకమ్మ ఆకారంలో అలంకరించిన ఫ్లోట్స్‌ను- హుస్సేన్ సాగర్‌లో విడుదల చేయనున్నారు.

హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో బతుకమ్మ వర్క్‌షాపులు
‘సెప్టెంబర్ 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బతుకమ్మ వెల్‌కమ్ డ్యాన్స్, – ఢిల్లీ, ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చే అన్ని విమానాల్లో దీనిని ప్రదర్శిస్తారు. రాష్ట్రం బయట నుంచి వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేక టూర్లు ఏర్పాటు చేస్తారు. జాతీయ స్థాయి ప్రచారంలో భాగంగా ఎయిర్ ఇండియా, ఇండిగో ఇన్-ఫ్లైట్ మ్యాగజైన్ల ద్వారా ప్రచారం నిర్వహించాలని నిర్ణయం. ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తా, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లోని టూర్ ఆపరేటర్లు పాల్గొంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News