Tuesday, September 16, 2025

ఫారెస్ట్ అధికారులపై దాడిని ఖండించిన కొండా సురేఖ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : భద్రాద్రి జిల్లా ఇల్లందు ఫారెస్ట్ డివిజన్ రేంజ్ పరిధి లోని అటవీ ప్రాంతం నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న మాఫియాను అడ్డుకునేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారులపైన ట్రాక్టర్‌తో ఎక్కించి చంపడానికి చేసిన కుట్రలను అటవీ , పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో దోషులు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

జరిగిన ఘటనపై సంబందిత అధికారులతో మంత్రి ఫోన్‌లో అడిగి తెలుసుకున్నారు. ప్రజా ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అదేవిదంగా జరిగిన ఘటన ను పూర్తిగా విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. అటవీ ప్రాంతం లో గతంలో జరిగిన దాడుల దృష్ట్యా అధికారులు ఎల్లపుడూ అప్రమత్తంగా ఉంటు, ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్న తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని.. అవసరం అవుతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చి ఎలాంటి చర్యలు తీసుకోవాలో వాటిని త్వరలోనే వెల్లడిస్తామని మంత్రి సురేఖ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News