Saturday, May 17, 2025

నా వ్యాఖ్యలను వక్రీకరించారు: కొండ సురేఖ.. థ్యాంక్స్ చెప్పిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండ సురేఖ(Konda Surekha) వివాదంలో చిక్కుకున్నారు. వరంగల్‌లోని కృష్ణ కాలనీ ప్రభుత్వం బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో రూ.5 కోట్ల సిఎస్ఆర్ నిధులతో అరవిందో ఫార్మా ఫౌండేషన్ నిర్మించిన నూతన భవనం శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె డబ్బులు తీసుకోకుండా మంత్రులు(Ministers) ఏ పని చేయరూ అంటు వ్యాఖ్యానించారు.

‘మా దగ్గరకు చాలా ఫైల్స్ వస్తుంటాయి. చాలా మంది మంత్రులు డబ్బులు తీసుకొనే ఫైల్స్ క్లియర్ చేస్తుంటారు. కానీ, నేను అలా చేయను. సమాజ సేవే చేస్తుంటాను. నాకు నయా పైస అక్కర్లేదు. స్కూల్ డెవలంప్‌మెంట్ చేయమన్నాను’ అని సురేఖ (Konda Surekha) అన్నారు. దీంతో ఇది చాలా వివాదాస్పదమైంది. దీనిపై ఆమె తాజాగా వివరణ ఇచ్చారు. బిఆర్‌ఎస్‌లో ఉండే మంత్రుల గురించి తాను మాట్లాడానని.. అలా తప్పుడు ప్రచారం చేయడం తప్పు అని ఆమె పేర్కొన్నారు. ఏ పనికైనా అప్పటి మంత్రులు (Ministers) డబ్బులు తీసుకొనే వారని అన్నారు.

అయితే కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కెటిఆర్ థ్యాంక్స్ చెప్పారు. మొత్తానికి కొండ సురేఖ నిజాలు బయట పెట్టారని ఆయన ఎక్స్‌ వేదికగా పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కమీషన్ సర్కార్ నడుపుతోందని కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News