Sunday, September 14, 2025

కొండా సురేఖ వర్సెస్ నాయిని… భగ్గుమన్న విభేదాలు

- Advertisement -
- Advertisement -

వరంగల్: మంత్రి కొండా సురేఖ, ఎంఎల్ఎ నాయిని రాజేందర్ రెడ్డి (Konda Surekha vs Naini) మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. కొండా సురేఖ లాగా పూటకో పార్టీ మారితే తాను కూడా 5 సార్లు ఎమ్మెల్యే అయ్యేవాడినని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలకు రాజేందర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

అంతకు ముందు నాయిని రాజేందర్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ (Konda Surekha vs Naini) ఘాటు విమర్శలు చేశారు. నాయిని ఏదో లక్కీగా ఎమ్మెల్యేగా గెలిచారన్నారు.  నాయిని రాజేందర్ రెడ్డి తన కంటే చిన్నోడు అని, ఏదో అదృష్టంలో ఎమ్మెల్యే అయ్యాడని, ఒకరు ఇద్దరు ధర్మకర్తలను నియామకం చేసే అధికారం కూడా తనకు లేదా? అని కొండా సురేఖ ప్రశ్నించారు.

Also Read: గంజాయి అమ్మడం లేదని… కిడ్నాప్ చేసి చితకబాదారు

గతంలో కాంగ్రెస్ నేత కొండా మురళీ వర్సెస్ ఎంఎల్ఎ ధర్మారెడ్డి మధ్య వర్గ విభేధాలు వచ్చిన విషయం తెలిసిందే.  తన గురించి మాట్లాడేంత స్థాయి ఎంఎల్‌ఎ ధర్మారెడ్డికి లేదని కాంగ్రెస్ నేత కొండా మురళి మండిపడ్డారు. ధర్మారెడ్డి వ్యాఖ్యలకు కొండా రీకౌంటర్ ఇచ్చారు. ధర్మారెడ్డి అరాచకాలు భరించలేకే ఆయన కార్యకర్తలు తన వెంట వచ్చారన్నారు. ధర్మారెడ్డికి తన ఇళ్లు గేటు కూడా తెలియదని దుయ్యబట్టారు. మహిళలను అవమానించింది ఆయన కాదా? అని కొండా ప్రశ్నించారు. ధర్మారెడ్డి చేసిన అభివృద్ధి ఏమో కానీ ఆయన అరాచకాలు అందరూ చెబుతారని కొండా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News