- Advertisement -
అమరావతి: దివ్యాంగుల పెన్షన్లపై వైసిపిది విషప్రచారం అని ఎపి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas) తెలిపారు. పేదరికం నుంచి ప్రజలు బయటకు రావాలనే పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లక్షల మంది పెన్షన్లు తొలిగించారని వైసిపి చేసిన ఆరోపణలపై కొండపల్లి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో ఒక్క పెన్షన్ (One pension) కూడా తొలగించలేదని, అర్హులకు మాత్రమే పెన్షన్ ఇవ్వాలనేది ప్రభుత్వం ఉద్దేశమని తెలియజేశారు. పెన్షన్లు తొలగించామని వైసిపి చేసిన విమర్శలపై ఆధారాలు చూపించండని కొండపల్లి డిమాండ్ చేశారు.
- Advertisement -