మన తెలంగాణ/గచ్చిబౌలి: అపార్ట్‌మెంట్‌లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. ఈగిల్ తెలంగాణ, గచ్చిబౌలి పోలీసులు సం యుక్తంగా దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అ యిన వారిలో తేజ, విక్రమ్, నీలిమా, చందన్, పురుషోత్తంరెడ్డి, భార్గవ్ ఉ న్నారు. వీరి నుండి 20 గ్రాముల కొకైన్, 8 ఎక్సటాసి ఫిల్స్, 3 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం… ఫెడ్లర్ అయిన తేజ (28), విక్రమ్‌లు తూర్పు గోదావరికి చెందిన వారు. తేజా క్లౌడ్ కిచన్, విక్రమ్ పౌల్ట్రి బిజినెస్ చేస్తున్నారు.
వారి స్వస్థలం అయిన రాజమండ్రికి చెందిన మన్నే నీలిమ (41) ముగ్గురు స్నేహితులు. చందన్ (20) కర్ణాటకకు చెందినవాడు. ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చుదువుతూ సప్లైయర్‌గా పనిచేస్తున్నాడు. పురుషోత్తం రెడ్డి (36) కొండాపూర్ రాజారాజేశ్వరి కాలనీలో వైన్స్ షాపు నిర్వహిస్తున్నాడు. భార్గవ్ (31) గచ్చిబౌలిలో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. రాహుల్ డ్రగ్స్ సప్లయర్. తేజ, విక్రమ్ నీలిమకు ముందుగానే డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉండడంతో తరుచు కలుసుకొని డ్రగ్స్ తీసుకునేవారు. తేజ బెంగుళూర్ వెళ్ల్లినప్పుడు అక్కడ రాహుల్ అనే వ్యక్తిని కలిశాడు. రాహుల్ కొకైన్ సరఫరా చేయడంతో తేజ అతని వద్ద కొకైన్ కొనుగోలు చేసి విక్రమ్, నీలిమతో కలిసి రాజమండ్రిలో తీసుకునేవారు. అదేవిధంగా గోవా, రాజమండ్రిలలో రేవ్ పార్టీలను నిర్వహించేవారు. అనంతరం నీలిమ ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కు వచ్చింది. అందరు కలిసి కొండాపూర్‌లోని సర్వీస్ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకొని తరుచు కలుసుకొని డ్రగ్స్ తీసుకునేవారు. చందన్ అనే ట్రాన్స్‌పోర్ట్ ద్వారా బెంగుళూర్ నుండి డ్రగ్స్‌ను కొనుగోలు చేసేవారు. కాగా చర్మకాంతిని పెంచే ఐవి ఇంజక్షన్లను తేజ తీసుకునేవాడు. దానికోసం సెలబ్రెటిలు తీసుకునే గ్లూటాహియోన్ విటమిన్‌ను ఉపయోగించేవాడు.
కాని దాని ధర తెలంగాణలో ఎక్కువగా 40 వేలు ఉండడంతో బెంగుళూర్‌లో తక్కువ ధరకు (11వేలకు) దొరకడంతో దానిని రాహుల్ ద్వారా కొనుగోలు చేసి తెప్పించుకునేవాడు. దాని ప్రకారంగానే గ్లుటాక్స్ 5జీ బ్రాండ్‌తో పాటు కొకైన్‌ను డిటిడిసీ ద్వారా పార్సెల్‌లో రప్పించుకునేవాడు. అనంతరం కొండాపూర్ ఇతర ప్రాంతాలలో రేవ్ పార్టీల పేరుతో డ్రగ్స్‌ను అందరూ తీసుకునేవారు. అదే క్రమంలో విశ్వసనీయ సమాచారం ప్రకారం కొండాపూర్‌లో సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ తహశీల్దార్‌గా పని చేస్తున్న మణిదీప్ 2023లో గోవాలో ఇచ్చిన రేవ్ పార్టీకి నిందితులంతా హాజరైనట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మణిదీప్‌కు గల సంబంధాలపై ఆరా తీస్తున్నారు. రాహుల్ పరారీలో ఉన్నాడు. పట్టుబడ్డ నిందితుల్లో నీలిమకు 3 రకాల డ్రగ్స్, తేజకు 5 రకాల డ్రగ్స్, పురుషోత్తమ్ రెడ్డి, విక్రమ్, భార్గవ్ లకు ఒక రకమైన డ్రగ్స్ టెస్ట్ పాజిటివ్ వచ్చంది. సప్లయర్ చందన్‌కు ఎటువంటి డ్రగ్ నిర్ధారణ కాలేదని ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.