Friday, May 2, 2025

మరో నేత బిఆర్‌ఎస్ కు గుడ్ బై?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఎస్‌పితోనే బిఆర్‌ఎస్ పొత్తుపెట్టుకున్న నేపథ్యంలో సిర్పూర్ మాజీ ఎంఎల్‌ఎ కోనేరు కోనప్ప ఆ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. కోనేరు కోనప్ప తన నియోజకవర్గంలో ముఖ్య నేతలను ఇంటికి పిలిపించుకోని సమావేశమయ్యారు. బిఆర్‌ఎస్ పార్టీలో ఉండలేనని, పార్టీ మార్పు ఇప్పుడు తనకు రాజకీయంగా అవసరమని పేర్కొన్నారు. కోనేరు సచివాలయానికి వెళ్లి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. పొంగులేటితో కలిసిన తరువాత సిఎం రేవంత్ రెడ్డితో ఆయన భేటీ కానున్నట్టు సమాచారం. పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్‌ఎస్-బిఎస్‌పి కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. దీంతోనే బిఆర్‌ఎస్‌కు ఆయన రాజీనామా చేయనున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News