బెంగళూరు: ఓ దంత వైద్యుడు తన అత్తను ముక్కలు ముక్కలు నరికి ప్లాస్టిక్ బ్యాగ్‌లో మూటకట్టి రోడ్డుపై పడేశాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం తుమకురు జిల్లా కొరటగెరె ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన తెలిపిన వివరాల ప్రకారం… డా రామచంద్రప్ప అనే దంత వైద్యుడికి లక్ష్మీ దేవి అత్త ఉంది. లక్ష్మీదేవికి వివాహేతర సంబంధాలు ఉన్నాయనే అనుమానం ఆమెను చంపాలని రామచంద్రప్ప నిర్ణయం తీసుకున్నాడు. మరో ఇద్దరు వ్యక్తుల సతీష్, కిరణ్‌ల సహాయంతో దేవిని అల్లుడు చంపాడు. అనంతరం మృతదేహాన్ని 19 ముక్కలుగా నరికి ఏడు ప్లాస్టిక్ బ్యాగ్‌లలో మూడ కట్టాడు. ఆ ప్లాసిక్ బ్యాగులను కోలాలా గ్రామ శివారులో రోడ్డు పక్కన పడేశాడు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కవర్లను ఓపెన్ చేసి చూడగా శరీర భాగాలను గుర్తించారు. ఆమె తల ఆధారంగా లక్ష్మీదేవిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రామచంద్రప్పను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
అత్తను 19 ముక్కులుగా నరికి చంపిన దంత వైద్యుడు
- Advertisement -
- Advertisement -
- Advertisement -