Thursday, September 11, 2025

ఎలక్షన్ కమిషన్ నిర్లక్ష్యానికి మమ్మల్ని బాధ్యులను చేస్తారా..!: కోట నీలిమ

- Advertisement -
- Advertisement -

రెండు ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియాతో పాటు బిజెపి తనపై చేసిన ఆరోపణలపై పిసిసి వైస్ ప్రెసిడెంట్, సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ స్పందించారు. గాంధీభవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. 2017లో అడ్రెస్ మార్పు కోసం ఫార్మ్-6 అప్లికేషన్ దరఖాస్తు చేసుకొని ధ్రువీకరణ పత్రం సైతం తీసుకున్నామన్నారు. అడ్రెస్ మార్పు అనే ప్రక్రియ పూర్తిగా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుందన్నారు. అడ్రెస్ మార్పు చేయకుండా ఎలక్షన్ కమిషన్ పూర్తిగా నిర్లక్ష్యం వహించిందన్నా రు.

ఎలక్షన్ కమిషన్ చేసిన తప్పుకు మమ్మల్ని ఎలా బాధ్యులను చేస్తారని ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నోటీసులు, వ్యక్తిగత సమాచారం బహిర్గతం చేయడంపై న్యాయ నిపుణులతో మాట్లాడి ఈ అంశంలో ముందుకు వెళ్తామన్నారు. మమ్ములను బ్లెమ్ చేస్తున్న బిజెపి ఐటి సెల్ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటామన్నారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ మీద సాక్షాధారాలతో పోరాటం చేస్తున్నారని, అందుకే కాంగ్రెస్ నేతలపై కక్షపురితంగా రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. మమ్ములను బ్లేమ్ చేయాలని బిజెపి చూస్తోందని, మమ్ములను బ్లెమ్ చేసిన సరే ఓట్ చోరీ మీద కాంగ్రెస్ పోరాటం ఆగదని ఆమె స్పష్టం చేశారు.

Also Read: హైదరాబాద్‌లో తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ కల్చరల్ ఫెస్టివల్

కోట నీలిమకు ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా క్షమాపణ చెప్పాలి: కాంగ్రెస్ శ్రేణులు
పిసిసి ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమకు ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా పంపిన నోటీ సుకు గాను కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. రసూల్ పుర చౌరస్తాలో శవయాత్ర చేసి శిరోముండనం చేసుకొని ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీహార్‌లో జరుగుతున్న ఓట్ చోరీ అంశాన్ని రాహుల్ గాంధీ తెర పైకి తీసుకువచ్చారనే అక్కసుతో ఎలక్షన్ కమిషన్ కొత్త డ్రామాకు తెర లేపిందన్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇసి తప్పుడు నోటీసులు పంపుతోందన్నారు.

రాహుల్ గాంధీ ప్రతిష్టను దిగజార్చేలా కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకురా లైన కోట నీలిమకు నోటీసులు పంపిందన్నారు. నిజానికి 2017 లోనే కోట నీలిమ అడ్రెస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నారని.. కానీ ఎలక్షన్ కమిషన్ ఇండియా కావాలనే అడ్రెస్ మార్పు చేయకుండా తాత్సారం వహించిందన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల కోసం పని చేయాల్సిన ఎలక్షన్ కమిషన్ ఒక పార్టీకి వంత పాడటం చాలా దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా ఇసి కోట నీలిమకు క్షమాపణ చెప్పి తన హోదాను కాపాడుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ లో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News