Saturday, August 30, 2025

నన్ను చంపితే డబ్బులు ఎవరు ఇస్తారో పోలీసులే తేల్చాలి: కోటంరెడ్డి

- Advertisement -
- Advertisement -

అమరావతి: తుది శ్వాస వరకు ప్రజలకు సేవ చేస్తానని, ఎవరి బెదిరింపులకు బయపడనని నెల్లూరు రూరల్ ఎంఎల్ఎ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ ఎంఎల్‌ఎను చంపేస్తే డబ్బే డబ్బు అని కొందరు రౌడీషీటర్లు మాట్లాడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కోటంరెడ్డి మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తన మిత్రుడు వీడియో పంపితే చూసి షాక్ గురయ్యానని చెప్పారు. ఎస్ పి మూడు రోజుల ముందు నుంచే సమాచారం ఉందని, తనకు ఎందుకు చెప్పలేదని నిలదీశారు.

పోలీసులు తనని ఎందుకు అప్రమత్తం చేయలేదని కోటంరెడ్డి అడిగారు. ఎమ్మెల్యేగా కాదు.. పౌరుడిగా అడుగుతున్నానని, తనని చంపితే డబ్బే డబ్బు అని వీడియోలో మాట్లాడారని, తనని చంపితే డబ్బు ఎవరు ఇస్తారో పోలీసులు తేల్చాలని ప్రశ్నించారు. వైఎస్ఆర్ సిపికి తాను ప్రత్యర్థిగా ఉన్నానని, వైసిపి నేతలు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని మండిపడ్డారు. తన తమ్ముడే కుట్ర చేశాడని ఆరోపణలు చేయడం సరికాదని, అధికారం కోసం సొంత వాళ్లను హతమార్చే డిఎన్ఎ మాది కాదు అని, ఇలాంటి బెదిరింపులకు భయపడనని కోటంరెడ్డి వివరణ ఇచ్చారు. ఎంఎల్ఎ కోటంరెడ్డి కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోటంరెడ్డి ఆఫీస్‌కు టిడిపి శ్రేణులు భారీగా చేరుకున్నాయి. ఎస్పి, పోలీసులకు వ్యతిరేకంగా టిడిపి శ్రేణుల నినాదాలు చేశారు. అరాచకశక్తులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News