Monday, August 25, 2025

ఎసిబికి చిక్కిన వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చుంచుపల్లి మండలం, విద్యానగర్‌కాలనీలోని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో సోమవారం ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నర్సింహారావు ఎసిబికి చిక్కారు. బంగారు చెలక గ్రామంలో గల ఒక ఫర్టిలైజర్ షాప్ యజమాని నుండి రూ.25 వేలు తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఎసిబి డిఎస్‌పి వై.రమేష్ తెలిపారు. ఆయన తెలిపిన కథనం ప్రకారం…యూరియా అమ్మకాల తనిఖీలలో భాగంగా ఫర్టిలైజర్ షాప్ యజమానికి అసిస్టెంట్ డైరెక్టర్ షోకాజ్ నోటీసు ఇచ్చారు. దానిని ఉపసంహరించేందుకు రూ.50 వేలు డిమాండ్ చేశారు. అయితే, తాను అంత డబ్బు ఇవ్వలేనని అనడంతో రూ.30 వేల వరకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత కూడా ఇవ్వలేనని చెప్పడంతో రూ.25 వేలకు అంగీకారం కుదిరింది. ఈ డబ్బులను తన కార్యాలయంలో తీసుకుంటూ ఉండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News