యంగ్ టాలెంటెడ్ దేవన్ హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న సూపర్ నేచురల్ లవ్ స్టొరీ ’కృష్ణలీల’.(Krishna Leela) ధన్య బాలకృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తోంది. బేబీ వైష్ణవి సమర్పణలో మహాసేన్ విజువల్స్ బ్యానర్‌పై జ్యోత్స్న జి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా జే.డి.లక్ష్మీ నారాయణ కృష్ణ లీల సెకండ్ సింగిల్ సూరి ఓరి సూరి సాంగ్ ని లాంచ్ చేశారు. స్టార్ కంపోజర్ భీమ్స్ ఈ సాంగ్ ని ఎనర్జిటిక్ మోటివేషనల్ సాంగ్‌గా కంపోజ్ చేశారు. భాస్కర భట్ల రవి కుమార్ అద్భుతమైన సాహిత్యం రాశారు. ఈ సందర్భంగా జెడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. “యువత కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలనే సందేశం ఈ సాంగ్ లో ఉంది. ఈ సాంగ్ సినిమాకే కాదు యువతరానికి కూడా ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నా”అని అన్నారు. హీరో, డైరెక్టర్ దేవన్ మాట్లాడుతూ సూరి ఓరి సూరి పవర్‌ఫుల్ మోటివేషనల్ సాంగ్ అని తెలిపారు.
సూరి ఓరి సూరి..
- Advertisement -
- Advertisement -
- Advertisement -