మన తెలంగాణ / హైదరాబాద్ : ఎపి రాజధాని అమరావతి ప్రాంత అభివృద్ధి అథారిటీ (సిఆర్‌డిఎ) అభివృద్ధి కారణంగా కృష్ణ డెల్టా వ్య వస్థ (కెడిఎస్), నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి కాలువ, నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ మొదలైన ఆయకట్టులోని కొన్ని భాగాలు సిఆర్‌డిఎ పరిధిలోకి చేరుతున్నందున ఆ మేరకు మిగులు నీటిని తెలంగాణ అవసరాలకు కేటాయించాలని తెలంగాణ సీనియర్ కౌన్సెల్ వైద్యనాధన్ కృష్ణా వాటర్ డిస్యూట్ ట్రిబ్యునల్ కు విజ్ఞప్తి చేశారు. గురువారం న్యూఢిలీ లో ట్రిబ్యూనల్ ఛైర్మన్ జస్టిస్ బ్రిజేష్ కుమార్, సభ్యులు జస్టిస్ రామ్ మోహన్ రెడ్డి, జస్టిస్ ఎస్.తలపాత్ర ఎదుట సీనియర్ కౌన్సెల్ వైద్యనాథన్ తెలంగాణ వాదనలను తిరిగి ప్రారంభించారు. గత పదకొండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ కృష్ణా ప్రాజెక్టులకు కాకుండా బేసిన్ వెలుపల కొనసాగుతున్న ప్రాజెక్టులలో నీటిని వినియోగిస్తోందని ట్రిబ్యునల్ దృష్టికి తీ సుకువచ్చారు.
ప్రాజెక్టులలో పంట నీటి అవసరాలను తీర్చుకోవడంలో శాస్త్రీయ పద్ధతులప్రాముఖ్యతను సీనియర్ కౌన్సెల్ వివరించారు. తెలంగాణ రాష్ట్రం తరపున డాక్టర్ పళనిసామి సమర్పించిన వ్యవసాయ అఫిడవిట్‌ను కూడా ఆయన ట్రిబ్యునల్ దృష్టికి తీసుకువచ్చారు. ఆ యకట్టు యొక్క రూపకల్పన ప్రాంతాలను ఆం ధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచిందని, వాస్తవ ప్రాం తాల కంటే నీటి కేటాయింపుల అంచనా కో సం రూపొందించిన ప్రాంతాలను మాత్రమే ప రిగణలోకి తీసుకోవాలని ఆయన కోరారు. ఈ విషయంలో డాక్టర్ పళనిసామి కెడిఎస్ కోసం రూపొందించిన నీటి అవసరాలు 1995లో సిడబ్ల్యుసికి సమర్పించిన కెడిఎస్ ఆధునీకరణ నివేదికకు సమానమని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకువచ్చారు. ఎపి, తెలంగాణ ప్రాజెక్టులకు సం బంధించి పంట నీటి అవసరాన్ని లెక్కించడం లో డాక్టర్ పళనిసామి
అనుసరించిన పద్ధతిని వైద్యనాథన్ వివరించారు. బేసిన్ వెలుపలి ప్రాంతాలలో తడి పంటలకు బదులుగా ఇతర పంటలను పండించాలని తెలంగాణ సూచించిందని, ఆ విధంగా ఆదా అయిన నీటిని బేసిన్ లోపల కరువు పీడిత ప్రాంతాలకు కేటాయించవచ్చని సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ ప్రస్తావించారు. దీని వల్ల ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. విచారణ శుక్రవారం కూడా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రం తరపున సీనియర్ న్యాయవాది సిఎస్ వైద్యనాథన్, అడ్వకేట్ జనరల్, అదనపు అడ్వకేట్ జనరల్, ప్రభుత్వ సలహాదారు, ఐఎస్‌డబ్లూఆర్ యూనిట్ న్యాయవాదులు, ఇంజనీర్లు హాజరయ్యారు. ఎపి తరపున సీనియర్ న్యాయవాది ఉమాపతి, ఇతర న్యాయవాదులు, ఇంజనీర్లు హాజరయ్యారు.