Wednesday, September 3, 2025

అలా ఎందుకు చేస్తారని బాధపడుతుంటా:కృతి సనన్

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ చిత్ర పరిశ్రమలోని లింగ వివక్షపై తాజాగా కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో హీరోలకు ఉండే సౌకర్యాలు.. ఇచ్చే గౌరవం హీరోయిన్లకు ఉండవని అన్నారు. అయితే సౌకర్యాలు కల్పించడంలోనే కాకుండా గౌరవించడంలో కూడా అసమానత చూపుతారని ఆమె ఆరోపించారు. కథానాయకులకు పెద్ద పెద్ద కార్లు ఏర్పాటు చేస్తారని.. లగ్జరీయస్ రూమ్స్ కేటాయిస్తారని అన్నారు. అవి చాలా చిన్న విషయాలు కావచ్చని, కానీ అలా ఎందుకు చేస్తారని ఎప్పుడు బాధపడుతుంటానని కృతి సనన్ వ్యాఖ్యానించారు. సౌకర్యాలు పక్కన పెడితే.. మహిళలను తక్కువ చేసి చూస్తుంటారని ఆరోపించారు. అయితే హీరోలతో సమానమైన గౌరవానికి హీరోయిన్స్ కూడా అర్హులేనని తెలిపారు. సినిమా షూటింగ్ సమయంలో హీరోలు సెట్స్ కు చాలా ఆలస్యంగా వస్తారని, కానీ హీరోయిన్స్ మాత్రం ముందే అక్కడికి వెళ్లి ఎదురు చూడాలని కృతి సనన్ విమర్శించారు. తమకేమో సెట్స్ కు ముందే రావాలని పిలుస్తారని, కానీ హీరోలకు మాత్రం అలా చెప్పరని అన్నారు. అందుకే చిత్ర పరిశ్రమలోని ఫిల్మ్‌మేకర్స్ ఆలోచనా విధానంలో కచ్చితంగా మార్పు రావాలని కృతిసనన్ అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News