Thursday, August 28, 2025

బస్సు బీభత్సం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

మంగళూరులో గురువారం కర్ణాటక ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి బస్టాండ్ వద్ద వేచి ఉన్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో బస్సు ఒక ఆటోను ఢీకొట్టగా అది పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో సహా మొత్తం ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. కెఎస్‌ఆర్‌టిసి రోడ్డు సమీపంలో తలపాడి టోల్‌గేట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో హైదర్ (47), ఖదీజా (60)హస్నా (11) ,నఫీసా (52), ఐషాఫిదా (19), ఫరంగిపేట నివాసి అవ్వమ్మ (72) ఉన్నారు. బస్సు మంగళూరు నుంచి కాసరగోడ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News