Thursday, August 14, 2025

భట్టికి కెటిఆర్ సవాల్

- Advertisement -
- Advertisement -

దమ్ముంటే ఆరు గ్యారంటీలపై ఏ గ్రామానికైనా
వెళ్లి చెప్పండి కాంగ్రెస్ మోసాన్ని భరించలేక
నేతలను తన్నితరుముతారు లేకపోతే
రాజకీయ సన్యాసం తీసుకుంటా డిప్యూటీ
సిఎం ప్రకటనపై బిఆర్‌ఎస్ అగ్రనేత కెటిఆర్
ధ్వజం కొత్వాల్‌గూడ ఎకో పార్కు పనులు
నిలిచిపోవడానికి ప్రభుత్వమే కారణమని ఆక్షేపణ

మన తెలంగాణ/హైదరాబాద్ : దాదాపు అన్ని గ్యారంటీలు అమలు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన ప్రకటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ద మ్ముంటే ఇదే మాట తెలంగాణలోని ఏదైనా ఒ క గ్రామానికి వెళ్లి ప్రజలకు చెప్పాలని సవాలు విసిరారు. ఆరు గ్యారంటీల అమలుపైన కాం గ్రెస్ మోసాన్ని, ప్రాపగండాను చూసి కాంగ్రెస్ నేతలను గ్రామాల నుంచి తన్ని తరుముతున్నారని కెటిఆర్ తెలిపారు. భట్టి విక్రమార్కకు, ఆ యన క్యాబినెట్ మంత్రులకు దమ్ముంటే ఏదై నా ఒక గ్రామానికి వెళ్లి ఆరు గ్యారంటీలు అమ లు చేశామని చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ గ్రామం నుంచి వీళ్ళని తరిమి వేయకుంటే శా శ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాలు విసిరారు.

గ్యారంటీ కార్డులు దాచుకోండి, 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయినా ఒక్క గ్యారెంటీని సరిగ్గా అమలు చేయలేదని విమర్శించారు. ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ మోసాన్ని తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారని వ్యాఖ్యానించారు.హైదరాబాద్ కొత్వాల్ గూడ ఎకో పార్క్ ఆలస్యంపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వం ప్రజా సేవను పక్కన పెట్టి రాజకీయాలు, ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తోందని విమర్శించారు. ప్రభు త్వ అసమర్థత వల్లే కొత్వాల్ గూడ ఎకో పార్క్ పనులు నిలిచిపోయాయని అన్నారు. రెండేళ్ల క్రితమే ఎకో పార్క్ మెజార్టీ పనులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పారు. హైదరాబాదీల కోసం నిర్మించిన అంతర్జాతీయ పార్క్ ఇది అని కేటీఆర్ అన్నారు. ఇప్పటి వరకు పార్క్ పనులు పూర్తి కాని పరిస్థితి నెలకొందని అసహనం వ్యక్తం చేశారు.

నగర ప్రతిష్ఠను పెంచే ఈ ప్రాజెక్ట్ ప్రభుత్వ అశక్తత, అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయిందని దుయ్యబట్టారు. నిస్సహాయ ప్రభుత్వ హయాంలో నిస్సహాయ పాలన కొనసాగుతోందని విమర్శించారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని హిమాయత్ సాగర్ పక్కన 85 ఎకరాల్లో ఈ పార్క్ ను హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే ఈ పార్క్ లో పక్షిశాలను ఏర్పాటు చేసి దాదాపు 1,500 రకాల పక్షులను సేకరించి ఇక్కడి వాతావరణానికి అలవాటు చేస్తున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఒక రోజంతా అక్కడే గడిపేలా పలు అడ్వెంచరస్ గేమ్స్ ను కూడా రూపొందిస్తున్నారు. క్లైంబింగ్ వాల్, రోలర్ కోస్టర్, స్కై బ్రిడ్జ్, జాయింట్ స్వింగ్, హ్యూమన్ స్లింగ్ షాట్, జిప్ బైక్, 360 డిగ్రీల ఫ్లయింగ్ సైకిల్, రోప్ కోర్స్, బంగా ట్రంప్ లైన్ వంటివి ఇందులో ఏర్పాటు చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News