హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వల్ల తెలంగాణకు ప్రయోజనం శూన్యంగా ఉందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. కెటిఆర్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. గత 20 నెలల్లో సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి 50 సార్లు వెళ్లారని, తెలంగాణకు మాత్రం ప్రయోజనం లేదని చురకలంటించారు. ప్రతి ఢిల్లీ పర్యటనలో తెలంగాణకు ద్రోహం చేయడంతో వెన్నుపోటు పొడుస్తున్నారని, రేవంత్ గురువు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృష్ణా నది నీటి హక్కులు దారాదత్తం చేశారని కెటిఆర్ మండిపడ్డారు. తెలంగాణ సొమ్మును ఢిల్లీ పెద్దలకు పంచి పెడుతున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీ నుంచి తిరిగి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా తీసుకరావడం లేదని రేవంత్‌పై కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అఖిల భారత్ కాంగ్రెస్ కమిటీ చెందిన న్యాయ వనరులు, ఆర్‌జిఐ విభాగం నిర్వహించే వార్షిక సదస్సులో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొనేందుకు శుక్రవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లిన విషయం విధితమే.
ఢిల్లీకి 50 పర్యటనలు… జీరో ప్రయోజనం: కెటిఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -