హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుబట్టే సిబిఐకి కాళేశ్వరం కేసు అప్పగించారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏమీ తేలలేదని కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. కాళేశ్వరం నీటిని వాడుకుంటూ ప్రాజెక్టును బద్నాం చేస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేసినందుకు ప్రజలకు సిఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని అన్నారు. కొండపోచమ్మ నుంచి గ్రావిటీ ద్వారానే గండిపేటకు నీరు వస్తుందని, మూసి ప్రాజెక్టులో విడతల వారి దోపిడి జరుగుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిహెచ్ఎంసి ఎన్నికల తర్వాత ఉచిత మంచినీటి పథకాన్ని ఎత్తి వేస్తారని ఎద్దేవా చేశారు. యూరియా ఇచ్చిన వారికి ఓట్లు వేస్తామని చెప్పామని, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థుల్లో ఇద్దరు మంచివారని కెటిఆర్ తెలియజేశారు. కానీ వారు కాంగ్రెస్ బిజెపి తరపున పోటీ చేస్తున్నారని, బిజెపి కాంగ్రెస్ రైతులను వేధింపులకు గురిచేస్తున్నాయని అన్నారు. నోటా లేదు కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉంటున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ లో చేరానని కడియం శ్రీహరి కూడా చెప్పారని.. ఇంకా విచారణ ఏముంది? అని వారితో సిఎం సమావేశం పెట్టడం ద్వారా ఏం సందేశం ఇస్తున్నారని కెటిఆర్ ప్రశ్నించారు.
Also Read : బిసి రిజర్వేషన్ల విషయంలో బిజెపి ఎక్కడ అడ్డుపడింది?: రాంచందర్