హైదరాబాద్: పాలమూరు ప్రాజెక్టు వెనుకబాటుకు కాంగ్రెస్, టిడిపి కారణమని గతంలో సిఎం రేవంత్ రెడ్డి అన్నారని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డి మీద ఆశతో పాలమూరు ప్రజలు 12 సీట్లు ఇచ్చారని అన్నారు. జడ్చర్లలో కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేసి ఇచ్చామని, మిగతా 10 శాతం పనులు పూర్తి చేస్తే 12 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని తెలియజేశారు. కాంగ్రెస్ వచ్చి 22 నెలలు గడిచినా పాలమూరుకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీలో లో 10 మంది ఎమ్మెల్యేలు చేరారని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారని, 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవడానికి మొహమాటం ఎందుకు? అని కెటిఆర్ నిలదీశారు. కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దురవస్థ వాళ్లదని ఎద్దేవా చేశారు. పిసిసి అధ్యక్షుడి స్టేట్ మెంట్ ను తాము సుప్రీంకోర్టు ముందుంచుతామని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎట్టి పరిస్థితుల్లోనూ చర్యలు తీసుకోవాల్సిందేనని సూచించారు. కాంగ్రెస్ కండువా కప్పుకుని సిగ్గులేకుండా పార్టీ మారలేదని చెప్తున్నారని మండిపడ్డారు. పార్టీ మారకుంటే బిఆర్ఎస్ఎల్పికి ఎందుకు రావట్లేదు? అని కెటిఆర్ ప్రశ్నించారు.
Also Read : సామాజిక తెలంగాణ సాధన కోసం అందరినీ కలుపుకుని పోతాం: కవిత