Monday, September 15, 2025

ఆ విద్యార్థుల విద్యకు దెబ్బ కొడుతున్నారు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గత సిఎంలు తీసుకువచ్చిన మంచి పథకాలను మాజీ సిఎం కెసిఆర్ కొనసాగించారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఎస్సి, ఎస్టి, బిసి, మైనారటీ విద్యార్థుల విద్యకు దెబ్బ కొడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో జూబ్లీహిల్స్ వెంగళరావు డివిజన్ బిఆర్ఎస్ శ్రేణులతో కెటిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లలో రూ. 20 వేల కోట్ల ఫీజు రీయింబెర్స్ మెంట్, 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు రూ. 3 వేల కోట్ల బకాయిలను, పదేళ్లలో రూ.17 వేల కోట్లు కూడా తాము చెల్లించామని తెలియజేశారు. కళాశాలల బంద్ ఆపేలా బకాయిలు ఇచ్చి విద్యార్థులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో యూరియా సంక్షోభానికి కారణం ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీనేనని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులే యూరియాను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారని కెటిఆర్ మండిపడ్డారు.

Also Read : ఫీ రీయింబర్స్ మెంట్ లో కాంగ్రెసోళ్లకు 20 శాతం కమీషన్లు: కవిత

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News