Friday, June 13, 2025

కెసిఆర్‌ను అర్థం చేసుకోవడానికి కాంగ్రెస్ నేతలకు జీవితకాలం చాలదు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్ జీవితం ఒక చరిత్రగా నిలిచిపోతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వాలు 60 ఏళ్లలో చేయలేని అనేక కార్యక్రమాలను కెసిఆర్ విజయవంతంగా సాధించారని తెలిపారు. కాళేశ్వరం కమిషన్ ముందు కెసిఆర్ విచారణ సందర్భంగా కెసిఆర్ గొప్పతనాన్ని వర్ణిస్తూ కెటిఆర్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రజాస్వామ్య పోరాటంతో, తెలంగాణ ఆర్తితో తెలంగాణ కోసం, కేవలం తెలంగాణ కోసమే కెసిఆర్ పనిచేశారని పేర్కొన్నారు. ఉద్యమం ద్వారా కోట్లాది మందికి

స్వరాష్ట్ర ఆశయాన్ని అందించారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రం కరువుకు, దాహానికి శాశ్వత పరిష్కారం చూపించారని వ్యాఖ్యానించారు. కెసిఆర్ బలం, జీవనదృక్కోణాన్ని అర్థం చేసుకోవడానికి జోకర్ కాంగ్రెస్ నాయకులకు జీవితకాలం కూడా చాలదు అని విమర్శించారు. అల్ప మనస్తత్వం ఉన్న కాంగ్రెస్ నాయకులు 100 జన్మలు ఎత్తినా కూడా కెసిఆర్ సాధించిన విజయాల్లో పద వంతైనా సాధించలేరని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News