Friday, September 12, 2025

గ్రూప్-1 పరీక్ష అవకతవకలపై బిజెపి కిమ్మనడంలేదు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఏకంగా గ్రూప్-1 పరీక్షలనే రద్దు చేయాలని హైకోర్టు చెప్పిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి ఎన్ని స్కాములు చేసినా బిజెపి పట్టించుకోవట్లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్-1 అవకతవకలపై బిజెపి కిమ్మనడంలేదని, పోస్టుల అమ్మకం ఆరోపణలపై బిజెపి మౌనానికి కారణమేంటి? అని కెటిఆర్ ప్రశ్నించారు. తమ హయాంలో ప్రతిదానికీ సిబిఐ విచారణ కావాలని హడావిడి చేశారని, గ్రూప్-1 స్కాంపై బిజెపి నేతలు సిబిఐ విచారణ ఎందుకు కోరట్లేదని నిలదీశారు. రేవంత్, బిజెపి రహస్య మైత్రికి ఇది తాజా ఉదాహరణ మాత్రమేనని కెటిఆర్ ఎద్దేవా చేశారు.

Also Read : మ్యాన్ హోల్ మూతను మూసేందుకు తక్షణమే చర్యలు: కమిషనర్ రంగనాథ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News