Friday, July 18, 2025

బనకచర్లపై పోరాటానికి ఎక్కడివరకైనా సిద్ధం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిఎం రేవంత్‌ నిర్ణయం మారకపోతే మరో ఉద్యమం తప్పదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ (KTR) తెలిపారు. తెలంగాణ నీళ్లు తీసుకుపోతామంటే ఊరుకునేది లేదని, రేవంత్ నిర్ణయాన్ని మార్చుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కోవర్టు పాలన నడుస్తోందని, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేనే అంటున్నారని తెలియజేశారు. గోదావరి జలాలపై బిజెపి తన వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు.

మీటింగ్ పెట్టించింది, కమిటీ వేసేది ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలంగాణకు ద్రోహం చేయడానికి కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. బనకచర్లపై పోరాటానికి ఎక్కడివరకైనా సిద్ధంగా ఉన్నామని అన్నారు. వాటాలు తేల్చిన తర్వాతే ఏ ప్రాజెక్ట్ అయినా చేపట్టాలని సూచించారు. రేవంత్‌రెడ్డికి ఇరిగేషన్ (Irrigation Revanth Reddy) గురించి తెలియదని, ఆయనకు రియల్‌ ఎస్టేట్, బ్లాక్‌ మెయిల్‌ దందాలే తెలుసు అని విమర్శించారు. రాయల సీమకూ ప్రయోజనం కలగాలని  మాజీ సిఎం కెసిఆర్ ఆకాంక్షించారని కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News