హైదరాబాద్: హైదరాబాద్ లో లక్ష మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది మాజీ సిఎం కెసిఆర్ ప్రభుత్వమేనని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ (KTR) తెలిపారు. అనుకోకుండా వచ్చిన ఉపఎన్నికలో బిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని అన్నారు. తెలంగాణ భవన్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఒక్క అసెంబ్లీ సీటులో కాంగ్రెస్ గెలవలేదని విమర్శించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికను తేలిగ్గా తీసుకోవద్దని సూచించారు. జూబ్లీహిల్స్ లో లక్షమంది పేదలకు జిఒ 58,59 కింద ఇళ్ల పట్టాలు ఇచ్చామని తెలియజేశారు.
సన్నబియ్యంతో విద్యార్థులకు బిఆర్ఎస్ అన్నం పెట్టిందని అన్నారు. పేదవారికి మాత్రమే హైడ్రా నిబంధనలు వర్తిస్తాయా? అని ప్రశ్నించారు. తెలంగాణలో కులమతాల పేరుతో(name caste religion Telangana) కెసిఆర్ రాజకీయం చేయలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ వచ్చాక అనేక సంక్షేమ పథకాలు ఆగిపోయాయని, అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. పిఎం నరేంద్ర మోడీ, సిఎం రేవంత్ రెడ్డి ఎజెండా ఒక్కటేనని, రేవంత్ అనినీతిని బిజెపి కాపాడుతోందని ధ్వజమెత్తారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలుస్తున్నారని మండిపడ్డారు. హైడ్రా కాంగ్రెస్ వాళ్లకు చుట్టం.. పేదలకు భూతం అని ఎన్నికల కమిషన్ తీరు సరిగా లేదని కెటిఆర్ విమర్శించారు.