Sunday, August 31, 2025

రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం కన్ఫ్యూజన్ లో ఉంది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోడి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తే బిసి రిజర్వేషన్ల బిల్లు పాస్ అవుతుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఇక్కడ ఎంత మొత్తుకున్నా ఏం కాదని అన్నారు. బిసి రిజర్వేషన్లపై కెటిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బిసి రిజర్వేషన్లపై సిఎం రేవంత్ రెడ్డి నాలుగు సార్లు మాట మార్చారని మండిపడ్డారు. మార్చిలో బిల్లుకు, ఈ బిల్లుకు తేడా ఏంటో చెప్పాలని నిలదీశారు. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం కన్ఫ్యూజన్ లో ఉందని తెలియజేశారు. 52 సార్లు ఢిల్లీకి పోయిన సిఎం ఏం చేశారు? అని రేవంత్ ఎందుకు మోడీని కలవలేదని ప్రశ్నించారు. మోడి వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని, బిసి రిజర్వేషన్ల కోసం ఆమరణ దీక్ష చేయాలని కెటిఆర్ పేర్కొన్నారు.

Also Read : ఆ విషయంలో తెలంగాణ ప్రజలతో పేగు బంధం తెంచుకున్నారు: ఆది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News