హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇంత అవస్థలు పడుతుంటే సిఎం రేవంత్ రెడ్డికి పట్టింపులేనట్లుగా ఉందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. దోమకొండ చెరువు తెగిపోయి కామారెడ్డి రాకపోకలు నిలిచిపోయాయని అన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతూ.. రోమ్ నగరం తగలపడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుగా ఉందని, వరదలు ముంచెత్తుతుంటే మూసీ సుందరీకరణ గురించి, ఒలింపిక్స్ క్రీడల గురించి సమీక్ష చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో ఖమ్మంలో వరదలు వస్తే కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని, రైతులకు ఎకరాకు రూ. 25 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పనిచేయక పోయినా.. అధికారులు, పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని కెటిఆర్ పేర్కొన్నారు.
గతంలో ఖమ్మంలో వరదలు వస్తే కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు: కెటిఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -