Monday, July 7, 2025

యూరియా బ్లాక్ మార్కెట్ దందాపై విచారణ జరపాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రైతు సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసా లేదు.. రైతు రుణమాఫీ లేదని మండిపడ్డారు. కనీసం అప్పు తెచ్చి వ్యవసాయం చేద్దామంటే ఆఖరికి ఎరువులకు కూడా కరువు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అడిగినట్లుగా రైతులు ఆధార్ కార్డులు ఇచ్చినా, వారికి కనీసం బస్తా ఎరువు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఎందుకుందని ప్రశ్నించారు.

రాష్ట్రవ్యాప్తంగా 1.94 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల లోటు ఎందుకుందో రైతులకు వివరించాలని కోరారు. రూ.266.50 ఉండాల్సిన బస్తా యూరియా ధర ఇప్పుడు రూ.325 ఎలా అయ్యిందో రైతులకే కాదు, రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలియాలని నిలదీశారు. ఈ బ్లాక్ మార్కెట్ దందాను దగ్గరుండి నడిపిస్తోంది ఎవరని ప్రశ్నించారు. ఈ కృత్రిమ కొరత ఎవరివల్ల ఏర్పడుతుందో, ఆఖరికి ఎరువులను కూడా బుక్కేస్తున్న మెతన్నలు ఎవరో వెంటనే విచారణ జరిపించాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News