హైదరాబాద్: కేంద్రమంత్రి బండిసంజయ్‌పై చట్టరీత్య చర్యలు తీసుకొనేందుకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ (KTR) సిద్ధమయ్యారు. ఫోన్ ట్యాపింగ్ అంశాంలో తనపై ఆరోపణలు చేసినందుకు బండి సంజయ్‌పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. సిటీ సివిల్ కోర్టులో ఆయన ఈ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు బండి సంజయ్‌కి కెటిఆర్ గత నెలలోనే లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, తన ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలుగా కేటీఆర్ మంగళవారం పంపిన నోటీసులో పేర్కొన్నారు.
బండి సంజయ్ తన హోదాను దుర్వినియోగం చేస్తూ.. కేవలం రాజకీయంగా వార్తల్లో నిలిచేందుకు ఈ తరహా ఆరోపణలు చేశారని నోటీసుల్లో కెటిఆర్ (KTR) పేర్కొన్నారు. బండి చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవన్నారు. ఒక పార్లమెంటు సభ్యుడిగా, కేంద్రమంత్రిగా బాధ్యతయుతమైన పదవిలో ఉంటూ ప్రజాజీవితంలో ఉన్న మరో శాసనసభ్యుడిపై అసత్యాలతో కూడిన అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని చెప్పారు. బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నోటీసు అందిన వారం లోపు బండి సంజయ్ స్పందించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో కెటిఆర్ తాజాగా పరువు నష్టం దావా పిటిషన్‌ను దాఖలు చేశారు
Also Read : అంధకారంలో 13 లక్షల విద్యార్థుల భవిష్యత్తు : కెటిఆర్