Thursday, May 15, 2025

మీ మూర్ఖత్వం వల్ల అధికారులు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూర్ఖత్వం వల్ల అధికారులు జైలుకు వెళ్లే పరిస్థితి ఏర్పడిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇక్కడ పర్యావరణ విధ్వంసానికి తాను బాధ్యుడిని కాదని రేవంత్ రెడ్డి తప్పించుకునే అవకాశం లేదని రేవంత్ రెడ్డి తన తప్పు ఒప్పుకోవాలన్నారు. సీఎం దుష్ప్రవర్తనతో తెలంగాణ ప్రభుత్వ అధికారులను సుప్రీంకోర్టు హెచ్చరించిందన్నారు. కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. వందల బుల్డోజర్లతో ధ్వంసం చేసిన కంచె గచ్చిబౌలి అడవులను తిరిగి పునరుద్ధరించాలని లేకుంటే రేవంత్ రెడ్డికి కోర్టు శిక్షలు తప్పవన్నారు.

కంచె గచ్చిబౌలి భూములను అమ్మి పది వేల కోట్ల రూపాయల స్కాం చేయడం ముమ్మాటికి అవినీతి, నమ్మకద్రోహమేనని, సెలవుదినాల్లో బుల్డోజర్లను పంపి అడవులను ధ్వంసం చేయడం ముమ్మాటికి పర్యావరణ చట్టాల ఉల్లంఘనేనని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి బాధ్యతారాహిత్య చర్యల ఫలితంగా పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిందన్నారు. కంచె గచ్చిబౌలి భూములను ప్రభుత్వం కాపాడాల్సిందేని ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తాను సృష్టించిన విధ్వంసానికి, తన బాధ్యతారాహిత్యానికి, చేసిన పది వేల కోట్ల స్కాంకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News