Friday, July 18, 2025

సిఎంను కోర్టుకు లాగుతా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:మీడియా తో చిట్‌చాట్ పేరుతో సిఎం రేవంత్‌రెడ్డి త నపై అసత్య ఆరోపణలు చేశారని బి ఆర్‌ఎ స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పే ర్కొన్నారు. ఢిల్లీలో సిఎం చేసిన వ్యాఖ్యలపై కెటిఆర్ ఎక్స్ వేదికగా స్పందించా రు. రేవంత్ రెడ్డి మీడియా చిచ్ చాట్ పే రుతో తన పైన, ఇతరుల పైన విషయం చిమ్మడం ఇది మొదటిసారి కాదు అని, కేవలం ముఖ్యమంత్రి కార్యాలయానికి గౌరవం ఇచ్చి ఇప్పటివరకు సంయమ నం పాటించానని చెప్పారు. తప్పుడు ఆ రోపణలకు మూ ల్యం చెల్లించుకోక త ప్పదు అని.. సిఎం క్షమాపణ చెప్పకపో తే పర్యవసానాలు ఎ దుర్కోవాల్సి ఉం టుందని హెచ్చరించా రు. డ్రగ్స్ కేసులో తనపై విచారణ జరుగుతుందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి ఆధారం ఏమిటో చెప్పాలని డిమాండ్ చే శారు.

తనపై ఏ మైనా కేసు నమోదు అ యిందా.. కనీ సం అణువంత రుజువైన ఉ న్నదా..? అని ప్రశ్నించారు. సిఎంకి ద మ్ముంటే దొంగ చాటుగా చేసిన వ్యాఖ్యల పై ఆ ధారాలు బయటపెట్టాలనీ సవాలు విసిరారు. లేకుంటే తాను చేసింది చౌకబా రు, చిల్లర వ్యాఖ్యలు అని ఒప్పుకోవాల ని అన్నారు. హైదరాబాదులో తనతో ముఖాముఖి చర్చకు వచ్చే దమ్ము లేక ఢిల్లీ వరకు ప్రయాణం చేసి మరి రే వం త్ రెడ్డి తనపై బురద జల్లుతున్నారని ఆ రోపించారు. కేవలం చట్టం పరిధి నుం చి న్యాయస్థానాల పరిధి నుంచి తప్పించుకోవడానికే సిఎం చిట్ చాట్‌ల పేరు తో దొంగచాటు మాటలు మాట్లాడుతున్నారని ఆ రోపించారు. వీటన్నింటినీ ఇకపై సహించేది లేదని తేల్చిచెప్పారు. రేవంత్‌రెడ్డి.. మిమ్మల్ని కోర్టుకు లాగుతా అని వెల్లడించారు.

బిఆర్‌ఎస్ కార్యకర్తల అరెస్టులో పోలీసుల వైఖరిపై కెటిఆర్ ఆగ్రహం
బిఆర్‌ఎస్ కార్యకర్తల అరెస్టులో పోలీసుల వైఖరిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ బాసుల ఆదేశాల మేరకు అమాయకులను అక్రమ కేసుల్లో ఇరికించి, అరెస్టులు చేసి జైళ్లను పంపుతున్నారని డిజిపిని ఉద్దేశిస్తూ ఆరోపించారు. పాలన అతిక్రమణలు, భయానక పరిమాణాలు ప్రజలు గమినస్తున్నారని చెప్పారు. ప్రభుత్వంలో ఎవరూ శాశ్వతంగా ఉండబోరని గుర్తుంచుకోవాలని సూచించారు. తమ రోజు వచ్చినప్పుడు ప్రతి చర్యను సమీక్షిస్తామని చెప్పారు. న్యాయ వ్యవస్థపై తమకు పూర్తిగా నమ్మకం ఉందని కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News