ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మరోసారి ఫైరయ్యారు. తనపై సిఎం తప్పుడు ఆరోపణలు చేశారని.. అందుకు క్షమాపణలు చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో సిఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కెటిఆర్ స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. “రేవంత్ రెడ్డి చిట్‌చాట్‌ల పేరుతో అబద్దాలు ఆడుతున్నాడు. నాపై చేసిన అసత్య ఆరోపణలపై క్షమాపణ చెప్పాలి.. లేదంటే కోర్టులకు లాగుతా. చిట్‌చాట్‌లో నా మీద ఆధారాలు లేని ఆరోపణలు చేయడానికి ఢిల్లీకి వెళ్తున్నాడు. నా మీద డ్రగ్స్ కేసుల్లో దర్యాప్తు జరుగుతోందని చెప్పాడు. రేవంత్ రెడ్డిని నేను సూటిగా అడుగుతున్నా.. నా మీద ఏదైనా డ్రగ్స్ కేసు అయ్యిందా?, నీ దగ్గర కనీసం ఒక చిన్న రుజువు అయినా ఉందా?. నాకు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా?.. దమ్ముంటే వాటిని బయటపెట్టాలని సిఎం రేవంత్ కు సవాల్ చేస్తున్నా. చట్టపరమైన జవాబుదారీతనం నుండి తప్పించుకోవడానికి రేవంత్ రెడ్డి ఈ చిట్‌చాట్‌ల ముసుగులో వ్యక్తిత్వ విధ్వంసానికి పాల్పడుతున్నాడు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -